28 జనవరి 2017

కొట్టుకుచావండి కొడుకుల్లారా !!

నా ఈ కొత్త కవిత ,
రాజకీయ పక్షం/కులం/అభిమానం అని చెప్పుకుంటూ ఆలోచన లేకుండా facebook /twitter /youtube లో కొట్టుకు/తిట్టుకు చస్తున్న  పశువుల మెదడున్న చేవలేని వెన్నెముక లేని ఈనాటి యువత మీద...........

ఓ యువకులారా!!

విషయాల మీద అభిప్రాయం లేదు మీకు
మనుషుల మీద తప్ప

స్పష్టమైన ఆలోచన లేదు మీకు
అనుకరించే గుడ్డితనం తప్ప

పౌరుషం అంటే తెలియదు మీకు
కొట్టుకు/తిట్టుకోవడం తప్ప

ఎంత చదివిన ఎదగలేదు మీరు
అడ్డదిడ్డంగా వాదించడం తప్ప
--------------------------------------------------------

కొట్టుకుచావండి కొడుకుల్లారా !!
కొట్టుకుచావండి!!

కులమంటూ , మతమంటూ 
మానవత్వమే లేదంటూ 

కొట్టుకుచావండి కొడుకుల్లారా !!
కొట్టుకుచావండి!!

నటుడంటూ, నాయకుడంటూ 
అభిమానివై , కార్యకర్తవై 

వాడు చెప్పిందే నిజమంటూ 
వీడు చేసిందే ధర్మమంటూ 

విచక్షణ జ్ఞానం లేకుండా 
అనుక్షణం మద్దతిస్తూ 

కొట్టుకుచావండి కొడుకుల్లారా !!
కొట్టుకుచావండి!!

మెదడును మూలన పడేసి,
నోరును బజారున పడేస్తూ

హృదయాన్ని దాచి, 
చేయిజేసుకుంటూ 

ఓపికలేని యంత్రాల్లా 
మత్తు ఎక్కినా కోతుల్లా 
మదమెక్కిన ఏనుగుల్లా 

కొట్టుకుచావండి కొడుకుల్లారా !!
కొట్టుకుచావండి!!

12 జూన్ 2015

కోట్ల కోసం ఒకరు, నోట్ల కోసం మరొకరు - kotla kosam okaru, notla kosam marokaru

కోట్ల కోసం ఒకరు, నోట్ల కోసం మరొకరు
కూటికొరకు పరుగెత్తే వాణ్ని పట్టించుకునేదెవ్వరు?

kotla kosam okaru, notla kosam marokaru
kootikoraku parugetthe vaanni pattinchukunedevvaru

ఇది మన దౌర్భాగ్యం - Idi mana Dhowrbhagyam

ఆ పార్టీ ఈ పార్టీ
కాదేది అవినీతికనర్హం

ఈ పత్రిక ఆ టీవీ
అంతా నాటకీయం

ఆ వార్త ఈ వివరణ
అన్నీ డబ్బుమయం

వాళ్ళ పత్రిక వీళ్ళ టీవీ
డప్పు కొట్టే సంపాదకీయం

మా నాయకుడు మీ నాయకుడు
అభిమానించే మూర్ఖత్వం

చదువుకున్న వాళ్ళు కూడా
ఆలోచించని దౌర్భాగ్యం

aa party ee party
kaadedi avineethikanarham

ee patrika aa tv
antha naatakeeyam

aa vaartha ee vivarana
annee dabbumayam

vaalla patrika veella tv
dappu kotte sampaadakeeyam

maa naayakudu mee naayakudu
abhimaaninche mookhatwam

chaduvukunna vaallu kooda
aalochinchani dhowrbhagyam

30 జనవరి 2015

పరితరణ రూపకర్త జీవితం - Software Engineer life

జీతం
లక్షల్లో కనపడుతుంది
వందల్లో మిగులుతుంది

పెళ్లి 
అమ్మాయిలూ జీతం లక్షల్లో కావాలంటారు
పొట్ట ముందుకు రాకూడదు
తలపై జుట్టు వెనక్కి పోకూడదు

కష్టం
చెమట చుక్కైనా పట్టదు
కాని రక్తపు బొట్టు కూడా మిగలదు

తిండి
పిజ్జాలు తింటే కడుపు నిండదు
తిన్నతి రొంత అరిగిచావదు

ఎక్కువ తింటే అజీర్తి
తక్కువ తింటే అసిడిటీ

ప్రపంచం
ప్రపంచంత స్నేహితులు
పక్కింట్లో అపరిచితులు

ఆదాయం
ఆదాయం గోరంత
ఆశలు కొండంత

కొనడం
అవసరమున్నప్పుడు  కాదు
తగ్గింపు ( రాయితీ ) ఉన్నప్పుడు కొంటారు

ఆనందం
మందు తాగడం
మత్తులో తూగడం

సమయం
మనుషులతో కన్నా
యంత్రాలతో ఎక్కువ గడుపుతారు

అప్పు
ఇంటినిండా సామాన్లు
ప్రతిదానిపై అప్పులు


గమనిక:  ఇవన్నీ అందరూ చేయాలనీ కాని   అందరూ అలా చేస్తారని కాదు వారు అల అలవాటు పడిపోయారని వ్యంగంగా రాయడమైనది